KA Paul Running At Polling Station
mictv telugu

పోలింగ్ రోజూ పాల్ ఎంటర్‌టైన్‌మెంట్

November 3, 2022

మునుగోడు వార్ మొదలైనప్పటి నుంచి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ ఫుల్ కామెడి పండిస్తున్నారు. జబర్దస్త్‌ని మించిన స్కిట్లు వేస్తూ తెగ నవ్విస్తున్నారు. మైక్ పట్టి నెలరోజులుగా నవ్వించిన పాల్… పోలింగ్ రోజూ పరుగులు పెట్టారు. పోలింగ్ కేంద్రాల దగ్గర హడావుడి చేస్తూ ఎంటర్‌టైన్ చేశారు.

నవ్వుల పాల్
పాల్ అడుగేస్తే రచ్చ రచ్చే. మాట్లాడితే పిచ్చా కామెడీ. ప్రత్యర్థి పార్టీలపై కేఏపాల్ చేసే విమర్శలు…వినేవారికి తెగ నవ్వు తెప్పిస్తున్నాయి. గురువారం పోలింగ్ కేంద్రాల దగ్గర పరుగులు పెట్టారు. అన్ని పోలింగ్ బూత్‌లను తనదైన స్టయిల్‌లో పరిశీలిస్తున్నారు. నెలరోజులుగా తెగ కష్టపడుతున్న కేఏపాల్…పోలింగ్ సమయంలోనూ మైకులు పెట్టగానే చెలరేగిపోయారు. ఓ రేంజ్‌లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులపై సెటైర్లు వేశారు.

కేసీఆర్‌ని ఎందుకు కలిశారు?

బుధవారం అర్ధరాత్రి సీఎం కేసీఆర్‌ని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కలిశారని కేఏ పాల్ ఆరోపించారు. పోలింగ్ ముందు రోజు కలవాల్సిన అవసరం ఏంటో చెప్పాలన్నారు. అంతకు ముందు పాల్వాయి స్రవంతిని కూడా కలిశారని పాల్ అన్నారు. అసలే సీరియస్‌గా పోలింగ్ నడుస్తున్న సమయంలో కేఏపాల్ చేసిన విమర్శలు పార్టీల నేతలు, కార్యకర్తలకు నవ్వు తెప్పిస్తున్నాయి.

అసలు జరిగింది ఇది…

బుధవారమంతా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి బిజీగా ఉన్నారు. చౌటప్పుల్‌లోనే ఎక్కువ సేపు ఉండిపోయారు. నాన్ లోకల్స్ వెళ్లిపోవాలని చెప్పినా టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు మునుగోడులోనే ఉన్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. వెంటనే వారిని పంపించాలని ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇంత సీరియస్‌గా ఉన్న రాజగోపాల్ రెడ్డి కేసీఆర్‌ని ఎలా కలుస్తారని బీజేపీ నాయకులు..పాల్ పై కౌంటర్ సెటైర్లు వేస్తున్నారు.

తొలి నుంచి పాల్ అంతే

మునుగోడు వార్ ప్రారంభం నుంచి పాల్..పొలిటికల్ ఎంటర్‌టైనర్ గా మారారు. ప్రచారంలో డ్యాన్స్ లు చేశారు. బాత్రూమ్ రూమ్ స్టెప్పులు వేస్తూ నవ్వించారు. ప్రధాన పార్టీలపై పాల్ చేసిన విమర్శలు తెగ నవ్వించాయి. మునుగోడుని అమెరికాలా మారుస్తా,అర్ధరాత్రి దాకా గెలుపు వ్యూహాలు రచిస్తానన్నారు. చివరకు పాల్ పొలిటికల్ స్కిట్లపై సీఎం కేసీఆర్‌ కూడా మునుగోడు సభలో సెటైర్లు వేశారు.