Ka Paul Running Out From Polling Station In Munugode
mictv telugu

పోలింగ్ కేంద్రం నుంచి కేఏ పాల్ పరుగులు

November 3, 2022

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జోరందుకుంది. ఉదయం 11 గంటల వరకు 25.8 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక ప్రధాన పార్టీలంతా నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఓ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు.

ఆ తర్వాత ఏం జరిగిందో? ఏమో? కేంద్రం నుంచి బయటకు వచ్చిన కేఏ పాల్ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. దీంతో ఏం జరుగుతుందో అర్ధం కాక అందరూ ఆశ్చర్యపోయారు. ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించడానికి వచ్చానన్నారు.

అంతకుముందు పోలింగ్ కేంద్రంలోకి కేఏ పాల్ చేతి వేళ్లన్నింటికీ ఉంగరాలు ధరించి రాగా.. “మీది ఉంగరం గుర్తు. చేతికి ఉంగరాల ధరించి పోలింగ్ బూత్‌లోకి రావడ రూల్స్ బ్రేక్ చేసినట్లు కాదా?” అని రిపోర్టర్లు ప్రశ్నించారు. దానికి సమాధానంగా టీఆర్ఎస్ వాళ్లు బయట కార్లలో తిరుగుతున్నారు. వాళ్లు కార్లలో రాకుండా సైకిళ్ల మీద వస్తారా? అని కౌంటర్ వేశారు.