ప్రజాశాంతి అధినేత కేఏ పాల్ సంచలన ప్రకటన చేశారు. ప్రజా శాంతి పార్టీ తరఫున తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాంత్ చారి తండ్రిని ఎమ్మెల్యేగా నిలబెడతానని అన్నారు. నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.
అనంతరం కేఏ పాల్ మాట్లాడుతూ..”తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబంలో ఎవరూ బలి కాలేదు. ప్రజాశాంతి పార్టీ తరఫున శ్రీకాంత్ చారి తండ్రిని ఎమ్మెల్యేగా నిలబెడతాం. డిసెంబర్ 3వ తేదీన శ్రీకాంత్ చారి తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న రోజు. ఆ రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలి. అమరవీరుల కుటుంబాలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. 1,200 మంది అమరవీరులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. ప్రజాశాంతి పార్టీ ప్రజల కోసమే ఉంది, ప్రజల కోసం పోరాటం చేస్తుంది” అని ఆయన అన్నారు.