ka pual dance with childerns
mictv telugu

కేఏ పాల్ తగ్గేదే లే… ప్రచారంలో చిన్నపిల్లలతో సూపర్ డ్యాన్స్

October 31, 2022

ka pual dance with childerns

మునుగోడు ప్రచారంలో ప్రధాన పార్టీలు నియోజకవర్గంలో వేడిని పుట్టిస్తుంటే… ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ తన ప్రచారంతో కూల్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ప్రచారం పేరిట కేఏ పాల్ చేస్తున్న సందడి మామూలగా లేదు.. ఉప ఎన్నిక గడువు దగ్గర పడతుండడంతో వినూత్నరీతిలో ప్రచారం చేసి స్పెషల్ అట్రాక్షన్‎‎గా నిలుస్తున్నారు. రోజుకో అవతారం, వెరైటీ ప్రచారాలతో ఓట్లును కోరుతున్నారు.

గత రెండు రోజుల్లో రైతు, గొర్రెల కాపరి వేషాలతో అలరించిన కేఏ పాల్ తాజాగా చిన్నపిల్లలతో డ్యాన్స్ వేసారు. చండూరు మండలంలోని ప్రచారంలో భాగంగా పిల్లలతో పాల్ వేసిన స్టెప్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొదటి నుంచి ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నకేఏ పాల్ తనదైన శైలిలో ప్రజలను ఎంటర్ టైన్ చేస్తున్నారు.తన మాటలు, హావ భావాలు, గెటప్‌‌‌లతో తగ్గేదే లే అంటూ ముందుకు దూసుకుపోతున్నారు. తనకు ఓటు వేస్తే మునుగోడు అమెరికా చేస్తానని, ఓటు వేయకపోతే బాంబులు వేస్తా అంటూ ఆయన చేస్తున్న ప్రసంగం నియోజకవర్గంలో నవ్వులు పూయిస్తోంది.. ఇక మంగళవారంతో ప్రచార గడువు ముగుస్తుండడంతో పార్టీలు ప్రచార జోరును పెంచాయి. ఎవరికి తగ్గట్లుగా వాళ్లు వినూత్న ప్రచారం నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు