ka pual intresting comments telugu state politics and inidan politics
mictv telugu

బిల్ క్లింటన్, బిల్ గేట్స్‌ను చంద్రబాబుకు నేనే పరిచయం చేశా..అమరావతి కోసం అమెరికా నుంచి ఫోన్లు :కేఏ పాల్

March 19, 2023

ka pual intresting comments telugu state politics and inidan politics

బిల్ క్లింటన్, బిల్ గేట్స్‌ను చంద్రబాబుకు తానే పరిచయం చేశానని ప్రజాశాంతి అధ్యక్షులు కేఏ పాల్ తెలిపారు. ఈ విషయం చదువుకున్న ప్రతీ ఒక్కరికీ తెలుసని వెల్లడించారు.ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలో ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. క్యూబా, జింబాబ్వే వంటి చిన్నా దేశాల్లో ఉచిత వైద్యం అందించినప్పుడు మన దేశంలో ఎందుకు అందించలేమని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల వరకు మీడియా యాజమాన్యాలు తనకు రోజుకు రెండు గంటలు నాకు కేటాయించాలని కోరారు.

అమెరికా నుంచి ఫోన్స్ వస్తున్నాయి.

కుల, కుటుంబ పాలన పోవాలంటే ప్రశాశాంతి పార్టీ రావాలని పాల్ పిలుపునిచ్చారు. కేసీఆర్, చంద్రబాబు, జగన్ వల్ల ఏం కాదని..వారు తెలుగు రాష్ట్రాలను నాశనం చేశారని మండిపడ్డారు. ప్రజాశాంతి పార్టీ పోటీ చేయకపోవడం వల్లనే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పని అయిపోయిందన్నారు. కేఏల్ పాల్ వస్తేనే అమరావతి అభివృద్ధి జరుగతాదంటూ అమెరికా నుంచి ఫోన్ చేశారని తెలిపారు.

దేశం నాశనం

ప్రధాని మోదీ, కాంగ్రెస్ చేతిలో దేశం నాశనం అయ్యిందంటూ కేఏ పాల్ ధ్వజమెత్తారు. ప్రపంచంలో మన దేశంలో ఉన్న వనరులు ఇంకెక్కడా లేవన్నారు. భారత్ దేశంలో అత్యంత తెలివైన వారు ఉన్నా ఉపయోగం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదానీకి లక్షల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయని పాల్ ప్రశ్నించారు. ఏపీ ప్రతేక హోదా ఎందుకు ఇవ్వలేదంటూ మోదీని నిలదీశారు. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేసీఆర్ పార్టీలు మోదీకి బీ పార్టీలు అని ఆరోపించారు. మరో 18 నెలల్లో భారత దేశం శ్రీలంక కానుందని జోష్యం చెప్పారు. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.68 వేల కోట్ల అవినీతి జరిగిందని పాల్ ఆరోపణలు చేశారు.