కష్టాల్లో రజనీ కాలా... - MicTv.in - Telugu News
mictv telugu

కష్టాల్లో రజనీ కాలా…

May 30, 2017


సెట్స్ పైకి వెళ్లకముందే ర‌జ‌నీకాంత్ 164వ చిత్రం కాలా సినిమా వివాదాల్లోకెక్కింది. ఫిలిం మేక‌ర్ కె రాజ‌శేఖ‌ర‌న్ అలియాస్ కెఎస్ నాగ‌రాజ్ చిత్ర యూనిట్ పై కేసు న‌మోదు చేశాడు. కాలా క‌రికాల‌న్ అనే టైటిల్ ని తాను 1996లోనే సౌత్ ఇండియ‌న్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ లో రిజిస్ట‌ర్ చేసుకున్నానని అంటున్నాడు. ర‌జనీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈ సినిమాను తెరకెక్కించాల‌ని భావించ‌గా, ఫ్యాన్స్ క్ల‌బ్ త‌ర‌పున ప‌లు మార్లు తలైవాని క‌లిసాను అని నాగ‌రాజ్ చెబుతున్నాడు. ఫ్యాన్ క్ల‌బ్ చీఫ్ స‌త్య నారాయ‌ణ్ ద్వారా ర‌జనీకాంత్ కి క‌థ కూడా న‌రేట్ చేసిన‌ట్టు ఈ ఫిలిం మేక‌ర్ తెలిపాడు. తాను రాసుకున్న స్క్రిప్ట్ ని కాలా చిత్ర యూనిట్ దొంగిలించిందంటూ స్క్రిప్ట్ పేపర్స్ ని ఆధారాలుగా చూపిస్తూ చెన్నై పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదు చేశాడు.