అవార్డు రాలేదని..అలిగి వెళ్లిపోయిన కబీర్ సింగ్! - MicTv.in - Telugu News
mictv telugu

అవార్డు రాలేదని..అలిగి వెళ్లిపోయిన కబీర్ సింగ్!

December 11, 2019

shahid kapoor.

బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ఇటీవల నటించిన ‘కబీర్ సింగ్’ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసందే. ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా నటన పరంగా షాహిద్‌కి మంచి పేరు తీసుకొచ్చింది. దీంతో స్టార్ స్క్రీన్ అవార్డ్స్‌లో తనకు ఉత్తమ నటుడి అవార్డు వస్తుందని ఆయన ఆశించారు. ఈ క్రమంలో ఈ అవార్డుల కార్యక్రమంలో డ్యాన్స్‌ చేసేందుకు ఒప్పుకున్నారు. కానీ, అవార్డుల వేడుక ప్రారంభమైన తర్వాత ఉత్తమ నటుడిగా ‘గల్లీబాయ్‌’ చిత్రానికిగాను రణవీర్‌ సింగ్‌కు అవార్డు దక్కింది.

దీంతో నిరాశకు గురైన షాహిద్ డ్యాన్స్‌ ప్రదర్శన ఇవ్వకుండానే కార్యక్రమం నుంచి వెళ్లిపోయారని బాలీవుడ్ చర్చ జరుగుతోంది. ఈ అవార్డుల ఫంక్షన్ నిర్వాహకులు వెంటనే షాహిద్‌కు బదులు మరో నటుడు వరుణ్‌ ధావన్‌తో డ్యాన్స్‌ ప్రదర్శన చేయించారట. ఈ విషయంపై షాహిద్‌ స్నేహితులు మాట్లాడుతూ..అవార్డు రాకపోవడంతో షాహిద్‌ నిరాశగా అక్కడి నుంచి వచ్చేశాడని వస్తున్న వార్తలు అబద్దం. షాహిద్‌ వృత్తిపరంగా, వ్యక్తిగతంగా చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు. కొన్ని అనారోగ్య కారణాల వల్ల డాక్టర్లు ఆయనకు కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అయినా షాహిద్‌ డ్యాన్స్‌ ప్రదర్శన ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అవార్డుల కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆయన ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. అందుకే అక్కడి నుంచి వచ్చేశారు’ అని పేర్కొన్నారు. షాహిద్‌ ప్రస్తుతం ‘జెర్సీ’ రీమేక్‌లో నటిస్తున్నారు.