kacha badam fame bhuban badyakar claims inability to pay rent
mictv telugu

Kacha Badam : పుట్టెడు కష్టాల్లో కచ్చా బాదాం పాటగాడు

March 6, 2023

సైకిల్ మీద పల్లీలు, శనగలు అమ్ముకుంటూ కచ్చా బాదాం అంటూ పాడిన పాట వెస్టె బెంగాల్ కు చెందిన భుబన్ బద్యాకర్‏‏ను ఓవర్‏నైట్ లో స్టార్‏ని చేసింది. ఓ వినియోగదారు అప్ లోడ్ చేసిన ఈ పాట వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది . పాటకు ఆల్ ఇండియాలో మంచి గుర్తింపు లభించడంతో బుల్లితెరపైన కొన్ని కార్యక్రమాల్లో స్పెషల్ గెస్ట్ గా హాజరై పాటను పాడాడు కూడా. తెరముందు సెలబ్రిటీనే అయినా బద్యాకర్ తెరవెనుక అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అద్దె ఇంట్లో ఉంటూ అద్దె చెల్లించలేని దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు ఈ పల్లీల వ్యాపారి. అఖరికి తనకు పేరు తీసుకువచ్చిన కచ్చా బాదాం పాటను పాడలేని దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

బీర్‏భూం జిల్లాలోని కురల్‏జురి గ్రామానికి చెందిన భుబన్ కచ్చాబాదం పాటతో సెలబ్రిటీగా మారి కాస్త డబ్బులను పోగేశాడు. ఇకపై తన కష్టాలు తీరుతాయని కుటుంబంతో హాయిగా ఉండవచ్చని ఆశపడ్డాడు. కానీ తాను తన టాలెంట్ తో సంపాదించిన డబ్బులను గ్రామంలోని కొంత మంది కాజేశారని భుబన్ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ప్రస్తుతం స్వగ్రామాన్ని వీడి పక్కనే ఉన్న దుబ్రాజ్‏పూర్ కు మకాం మార్చాడు. అక్కడే తన కుటుంబంతో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సొంతూరులో కొత్త ఇల్లు కట్టుకున్నా ఉండలేని పరిస్థితి భుబన్ . ప్రతి నెల అద్దె రూ.2700 చెల్లించాల్సి ఉండగా భుబన్ కు అది తలకుమించిన భారంగా మారింది. పల్లీలు, శనగలు అమ్మిన డబ్బులు కుటుంబ పోషణకే చాలడం లేదని ఇంత అద్దె ఎలా చెల్లించాలని వాపోయాడు. తన పాటైనా పాడకుందామనుకుంటే కాపీరైట్ రావడంతో ఆ పాట ఇప్పుడు నే పాడలేనని చెబుతున్నాడు.

ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్ సొసైటీ లిమిటెడ్ పేరుతో బిర్భమ్‌కు చెందిన కంపెనీ , దాని యజమాని తనను మోసగించారని బద్యాకర్ తెలిపారు. యూట్యూబ్‌లో తన పాటను షేర్ చేసినందుకు వారు అతనికి రూ.3 లక్షలు చెల్లించారు. అయితే కాపీరైట్‌ను విక్రయించిన పేపర్‌పై సంతకం చేసినట్లు బద్యాకర్‌కు తెలియదు. “నేను చదువుకోలేదు, నాకు ఇంగ్లీష్ చదవడం కూడా రాదు, ఇప్పుడు, వారు నా పాటను కొనుగోలు చేశారని నాకు చెబుతున్నారు, నేను ఇప్పుడు ఫోన్‌లో కూడా సంప్రదించలేను.”అని బద్యాకర్ తన ఆవేదనను వెల్లడించారు.