క్షమాపణలు చెప్పిన ‘కచ్చా బాదామ్’ సింగర్ - MicTv.in - Telugu News
mictv telugu

క్షమాపణలు చెప్పిన ‘కచ్చా బాదామ్’ సింగర్

March 11, 2022

21

‘కచ్చా బాదామ్’ పాట ద్వారా ఫేమస్ అయిన వ్యక్తి భుజన్ బద్యకర్. సోషల్ మీడియా ద్వారా ఓవర్‌నైట్ సెలబ్రిటీ అయిన భుజన్‌ని ఆ సమయంలో కొందరు మీడియా వాళ్లు ఇంటర్వ్యూ తీసుకున్నారు. అందులో మీరు తిరిగి పల్లీలు అమ్ముతారా? అనే ప్రశ్న ఎదురైంది. దానికి భుజన్ ‘నేనిప్పుడు సెలబ్రిటీగా మారిపోయాను. ఇప్పుడు నేను మళ్లీ పల్లీలు అమ్మితే అవమానకరంగా ఉంటుంద’ని సమాధానమిచ్చాడు. ఈ సమాధానం విని పలువురు కాస్త పేరూ, డబ్బూ రాగానే కళ్లు నెత్తికెక్కి ఇన్నాళ్లు చేసిన పనిని చిన్నచూపు చూస్తావా అంటూ ఘాటుగా విమర్శించారు. దీంతో తప్పు తెలుసుకున్న భుజన్ ఓ సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ క్షమాపణలు చెప్పాడు. ప్రజలే నన్ను సెలబ్రిటీని చేశారని, తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే తిరిగి పల్లీలు అమ్మడానికి వెనుకాడనని స్పష్టం చేశారు. ఇప్పటికీ సాధారణ జీవితాన్నే గడుపుతున్నా. వ్యక్తిగా ఏ మాత్రం మారలేదంటూ చెప్పుకొచ్చాడు భుజన్ బద్యకర్