కువైట్‌లో కడప జిల్లా వాసి ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

కువైట్‌లో కడప జిల్లా వాసి ఆత్మహత్య

March 17, 2022

kadapa

కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కువైట్ సెంట్రల్ జైలులో ఆత్మహత్యకు చేసుకున్నాడు. కువైట్లోని ఆర్డియా ప్రాంతంలో ముగ్గురిని హత్య చేసిన కేసులో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కువైట్ పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ క్రమంలో అతడు ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

వివరాల్లోకి వెళ్తే.. మృతుడి స్వస్థలం కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నెపాడు గ్రామం. అతని పేరు వెంకటేశ్. మూడేళ్ల క్రితం తన భార్య స్వాతితో కలిసి జీవనోపాధి కోసం కువైట్ వెళ్లారు. అక్కడ వెంకటేశ్ దంపతులు తొలుత పనిచేసిన ఇంటి యజమాని, ఆయన భార్య, కుమార్తె దారుణ హత్యకు గురయ్యారు. కేసు విచారణలో భాగంగా అక్కడి పోలీసులు వెంకటేశ్ దంపతులను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో స్వాతిని వదిలి పెట్టడంతో మూడు రోజుల కిందట ఆమె స్వగ్రామానికి తిరిగొచ్చింది.

ఈ నేపథ్యంలో హత్య కేసులో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని అన్యాయంగా కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు తన భర్తను కాపాడాలంటూ జిల్లా కలెక్టర్, ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులకు వినతిపత్రం ఇచ్చి వేడుకుంది. ఈలోపే వెంకటేశ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న సమాచారం అందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.