Kadapa RTC bus stand closed for non-payment of rent
mictv telugu

అద్దె చెల్లించలేదని కడప ఆర్టీసీ బస్టాండ్ మూసివేత

September 22, 2022

కడప పాత బస్టాండుని మున్సిపల్ అధికారులు మూసివేశారు. అద్దె చెల్లించలేని కారణంగా గురువారం తెల్లవారు జాము నుంచి బస్సులను బస్టాండు ఆవరణలోకి రాకుండా అధికారులు అడ్డుకున్నారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురి కాగా, గమ్యస్థానాలకు వెళ్లేందుకు రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. కడప పాత బస్టాండును మున్సిపల్ అధికారులు నిర్మించారు. అక్కడ బస్సులను నిలిపినందుకు గాను ఆర్టీసీ ప్రతీనెలా అద్దె చెల్లిస్తుంది. అయితే 2013 నుంచి అద్దె చెల్లించకపోగా, ఇప్పటివరకు మొత్తం బకాయిలు రూ. 2.30 కోట్లకు చేరాయి. అప్పటినుంచి అద్దె చెల్లించాలని అధికారులు పలుమార్లు ప్రయత్నించినా ఆర్టీసీ పట్టించుకోలేదు. ఇటీవల మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న సూర్య సాయి ప్రవీణ్ దీనిపై దృష్టి సారించారు. అద్దె చెల్లించాలని ఆర్టీసీని కోరగా, వారు స్పందించలేదు. దీంతో బస్టాండులో బస్సులను రానీయకుండా అధికారులు చర్యలు చేపట్టారు. కాగా, కడప సీఎం జగన్ సొంత జిల్లా కావడం గమనార్హం. అంతేకాక, ఆర్టీసీ చైర్మెన్ కూడా ఇదే జిల్లాకు చెందిన వారు కావడం మరో విశేషం..