కదిరిలో ఘోరం.. భార్యపై స్నేహితులతో కలసి గ్యాంగ్‌రేప్ - MicTv.in - Telugu News
mictv telugu

కదిరిలో ఘోరం.. భార్యపై స్నేహితులతో కలసి గ్యాంగ్‌రేప్

December 3, 2019

కఠిన శిక్షలు పనిచేయడం లేదు. ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు, హెచ్చరికలు జావలా నీరుగారిపోతున్నాయి. దిశ ఉదంతంపై దేశం అట్టుడుకుతున్నా కామాంధులు ఏమాత్రం జంకలేదు. దేశం నలుమూలలా పసికందుల నుంచి పండుముసలమ్మల వరకు అత్యచారాలు, హత్యలకు గురవుతున్నారు. బయటివాళ్లే కాదు, సొంత మనుషులు కూడా దారుణంగా కాటేస్తున్నారు. 

కట్టుకున్న భార్యలో ఓ దుర్మార్గులు దారుణానికి పాల్పడ్డాడు. స్నేహితులతో కలసి ఆమె కాళ్లూ చేతులూ కట్టేసి సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. దిశ హత్యాచారంలో మాదిరే ఈ నీచులూ మద్యం మత్తుతో పైశాచికానికి పాల్పడ్డారు. అనంతపురం జిల్లా కదిరిలో ఈ దారుణం జరిగింది. మల్లేశ్ అనే వ్యక్తి గతంలో ఓ బాలికపై అత్యాచారం చేసి జైలుకెళ్లి వచ్చాడు. అయినా ప్రవర్తన మారలేదు. మద్యం తాగి, మిత్రులతో కలసి భార్యను చెరబట్టాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె మొదట్లో ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఆమె బాధగా కనిపిస్తుండంతో అంగన్ వాడీ కార్యకర్తలు ఆరా తీయగా విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.