డ్రగ్స్ తీసుకోవడం నేరమే.. కాజల్ అగర్వాల్ ! - Telugu News - Mic tv
mictv telugu

డ్రగ్స్ తీసుకోవడం నేరమే.. కాజల్ అగర్వాల్ !

July 25, 2017

డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు తన మేనేజర్ రోనీని అరెస్టు చేసి రిమాండ్ కు పంపడంతో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ట్విట్టర్లో స్పందించింది. తనకిది వెరీ షాకింగ్ న్యూసని, తన మేనేజర్ డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టవడం బాధాకరమే. డ్రగ్స్ తీసుకోవడం నేరమే, శిక్ష పడటం సమంజసమంటోంది. తను నాకు తెలుగు సినిమాలకు మాత్రమే మేనేజర్. మా అమ్మానాన్నలే నాకొచ్చిన తెలుగు ఆఫర్లను పరిశీలించి ఓకే చేస్తారు అని ట్వీటింది.

తనకు కేవలం సినిమాలు మాత్రమే చేసుకుపోవడమే తెలుసు తప్పితే ఇలాంటివి అస్సలు తెలియదు. నేనీ వార్త విని చాలా షాకయ్యాను !? అని చెప్పుకొచ్చింది. సిట్ నిర్దేషకులు కెల్విన్ కాల్ డేటా ఆధారంగా ఒక్కొక్కరి పేరును బయట పెడుతూ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకొంత మంది ప్రముఖుల పేర్లు కూడా బయటకొచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.