కాబోయే భర్తతో కాజల్ ఫోటో షూట్! - MicTv.in - Telugu News
mictv telugu

కాబోయే భర్తతో కాజల్ ఫోటో షూట్!

October 26, 2020

marriage

టాలీవుడ్ అందాల తార కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈ నెల 30న ముంబయికి చెందిన గౌతమ్‌ కిచ్లు అనే వ్యాపారవేత్తను ఆమె వివాహం జరుగనుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తక్కువ సంఖ్యలోనే అతిథులను ఆహ్వానిస్తున్నట్టు కాజల్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం వీరి పెళ్లి పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ జంట ఫోటో షూట్ నిర్వహించింది. 

ఆ ఫోటోలను కాజల్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘మా నుంచి మీకు దసరా శుభాకాంక్షలు’ అని ఆమె పేర్కొంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2007లో తేజ దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. చిరంజీవి, ఎన్టీఆర్, రామ్‌ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, పవన్ ‌కళ్యాణ్‌ తదితర స్టార్ హీరోల సరసన నటించారు. ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’, కమల్‌హాసన్ ‘ఇండియన్-2’, మంచు విష్ణుతో ‘మోసగాళ్లు’ సినిమాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో జాన్ అబ్రహాంతో ఓ సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నారు.