కాబోయే భర్తతో సన్నిహితంగా కాజల్.. ఫొటో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

కాబోయే భర్తతో సన్నిహితంగా కాజల్.. ఫొటో వైరల్

October 12, 2020

టాలీవుడ్ అందాల తార కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ముంబయికి చెందిన గౌతమ్‌ కిచ్లు అనే వ్యాపారవేత్తను ఈనెల 30న ఆమె పెళ్లి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించిన పాత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఫొటోలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నారు. దీంతో వీరికి ఎప్పటినుంచో పరిచయం ఉందని నెటిజన్లు అనుకుంటున్నారు.

వీరి పెళ్లి గురించి కాజల్ ట్వీట్ చేస్తూ.. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తక్కువ సంఖ్యలోనే అతిథులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపింది. 2007లో తేజ దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. చిరంజీవి, ఎన్టీఆర్, రామ్‌ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, పవన్ ‌కళ్యాణ్‌ తదితర స్టార్ హీరోల సరసన నటించారు. ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’, కమల్‌హాసన్ ‘ఇండియన్-2’, మంచు విష్ణుతో ‘మోసగాళ్లు’ సినిమాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో జాన్ అబ్రహాంతో ఓ సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నారు.