కాజల్ అవతార్ వచ్చేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

కాజల్ అవతార్ వచ్చేసింది..

February 5, 2020

kajal...

ప్రపంచ ప్రఖ్యాత మేడమ్‌ టుస్సాడ్స్ మ్యూజియంలో తమ విగ్రహం ఉండాలని ఎందరో సెలబ్రిటీలు కోరుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉన్న ఈ మ్యూజియాల్లో తమను తాము చూసుకోవాలి అనుకుంటారు. కానీ, ఆ అదృష్టం కొందరికి మాత్రమే దక్కుతుంది. ఆ కొందరి జాబితాలో ఇప్పుడు టాలీవుడ్ అందాల తార కాజల్ అగర్వాల్ వచ్చి చేరింది. 

తాజాగా మేడమ్‌ టుస్సాడ్స్ సంస్థ ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్ధం సింగ‌పూర్‌లోని మ్యూజియంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ మైనపు విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. కాజల్ అగర్వాల్  మైనపు విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించారు. ఇప్పటికే సింగపూర్ వెళ్లిన కాజల్ తన మైనపు బొమ్మ పక్కన నిలబడి ఫొటో దిగింది. మైనపు బొమ్మ ఏదో, నిజమైన కాజల్ ఎవరో గుర్తు పట్టాలంటే కష్టమే. ఎరుపు రంగు దుస్తుల్లో చేతిలో మైక్‌ పట్టుకుని కాజల్ తన బొమ్మ పక్కన నిలబడింది. తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి కాజల్ తన మైనపు బొమ్మతో ఫొటోలు దిగింది. ఈ ఘనత సాధించిన మొదటి సౌత్ నటి, మూడో తెలుగు సెలబ్రిటీ కాజల్ కావడం విశేషం. గతంలో బాహుబలి ప్రభాస్ మైనపు విగ్రహాన్ని బ్యాంకాక్‌లో ఏర్పాటు చేయగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు విగ్రహాన్ని సింగపూర్‌లో ఏర్పాటు చేశారు.

* బ్యాంకాక్‌లో ఉన్న ప్రభాస్ విగ్రహం

* సింగపూర్‌లో ఉన్న మహేష్ బాబు విగ్రహం