కాజల్ అగర్వాల్ పెళ్ళి సందడి.. ఫోటోలు వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

కాజల్ అగర్వాల్ పెళ్ళి సందడి.. ఫోటోలు వైరల్

October 30, 2020

Kajal Aggarwal marries Gautam Kitchlu.jp

టాలీవుడ్‌లో ఒక్కక్కరుగా పెళ్లీ పీఠలు ఎక్కుతున్నారు. తాజగా కాజల్ అగర్వాల్ తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పారు. ఈ రోజు ఆమె స్నేహితుడైన గౌతమ్‌ను ముంబైలో పెళ్లి చేసుకోబోతున్నారు. దానికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గురువారం రోజున ముంబైలోని కాజల్‌ నివాసంలో మెహందీ కార్యక్రమం జరిగింది. కుటుంబ సభ్యులు, పలువురు సన్నిహితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

View this post on Instagram

 

#kajgautkitched ?

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

కాజల్ సినిమాల విషయానికి వస్తే.. 2007లో తేజ దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. చిరంజీవి, ఎన్టీఆర్, రామ్‌ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, పవన్ ‌కళ్యాణ్‌ తదితర స్టార్ హీరోల సరసన నటించారు. ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’, కమల్‌హాసన్ ‘ఇండియన్-2’, మంచు విష్ణుతో ‘మోసగాళ్లు’ సినిమాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో జాన్ అబ్రహాంతో ఓ సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నారు.