టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాజల్, గౌతమ్ కిచ్లూల కొడుకుకు నీల్ కిచ్లూ అనే పేరును పెట్టారు. మదర్స్ డే సందర్భంగా తాజాగా కాజల్ తన బిడ్డతో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్గా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ స్టోరీని రాసింది.”నువ్వు నా మొదటి బిడ్డ.. నువ్వు ఎప్పుడు నాకు అండగా ఉంటావనుకుంటున్నాను.
నీ చిన్న చేతిని నా చేతిలోకి తీసుకున్న ఆ క్షణం.. నీ వెచ్చని శ్వాసను అనుభవించాను ..నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నీ నుంచి నేనింకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నువ్వే నా సూర్యుడు, నువ్వే నా చంద్రుడు, నువ్వే నా నక్షత్రాలన్నినువ్వు ఎల్లపుడూ ఇతరులకు ప్రేమ పంచాలి. ఎప్పుడూ ధైర్యం, దయ, సహనంతో ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు నాకు సర్వస్వం. ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవొద్దు ” అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.