శర్వానంద్‌కు నో చెప్పిన కాజల్ - MicTv.in - Telugu News
mictv telugu

శర్వానంద్‌కు నో చెప్పిన కాజల్

October 31, 2017

అగ్ర నటీమణులు సాధారణంగా అగ్ర హీరోలతో జోడీ కట్టడానికే ఇష్టపడతారు. చిన్నాచితకా నటులతో చేయాలని ఇష్టమున్నా.. కెరీర్ దెబ్బతింటుందని భయపడుతుంటారు.

తాజాగా అలాంటిదే జరిగింది కాజల్ విషయంలో. ఆమె శర్వానంద్‌తో కలసి నటించడానికి నో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ‘మహానుభావుడు’ చిన్ననటుడు కాకపోయినా అగ్రహీరో అయితే మాత్రం కాదనుకున్నట్లుంది కాజల్.  సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న శర్వానంద్ సినిమా కోసం నిర్మాతలు కాజల్‌ను సంప్రదించారట.  ఈ మూవీలో కథకు అనుగుణంగా శర్వానంద్ ద్విపాత్రాభియనం చేస్తున్నాడు. ఒక ప్రేమికుడి పాత్ర కాగా, మరోటి నడివయసు పాత్ర. నడివయసు పాత్రకు జోడీగా నటించాలని నిర్మాతలు కాజల్‌ను కోరాగా, ఆమె తిరస్కరించింది. డబ్బు బాగానే ఇస్తామన్నా.. ‘ముసలాడి పాత్ర’ పక్కన నేను చేయను అని తెగేసి చెప్పింది. దీంతో తమన్నాను తీసుకున్నారు. ప్రస్తుతం తమన్నా చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడం ఆమె ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది.