రైతుల తలరాత మార్చేది కాళేశ్వరమే.. కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

రైతుల తలరాత మార్చేది కాళేశ్వరమే.. కేసీఆర్

April 24, 2019

తెలంగాణ రైతుల తలరాతలు మార్చే ప్రాజెక్టుగా కాళేశ్వరమే అని మొదటినుంచి అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆసియా ఖండంలోనే రికార్డ్ నెలకొల్పిన

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 124.4 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులతో 105 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే పంపింగ్ అనుకున్నది అనుకున్నట్లు విజయవంతంగా జరగడం అత్యంత ఆనందకరమైనదిగా సీఎం అభివర్ణిస్తూ ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంతటి భారీ సామర్థ్యం కలిగిన పంపులను విజయవంతంగా వినియోగించడం ద్వారా ఆసియా ఖండంలోనే ఈ ఘనత సాధించిన ఏకైక దేశంగా భారత్, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.

Kaleshwaram is the one who cares for the farmers' troubles… KCR.

ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా మెదడును కరిగించాం. అనేక రకాల ఆలోచనలు చేశాం. ఎంతో శోధించి, చివరికి ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత కాళేశ్వరం దగ్గర మాత్రమే నీటి లభ్యత ఉందని నిర్ధారించుకున్నాం. అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయడం మినహా మరో గత్యంతరం లేదని భావించాం. కాళేశ్వరం ప్రణాళిక రూపుదిద్దుకోవడానికి నెలల తరబడి కసరత్తు చేశాం. గోదావరి నుంచి నీటిని తోడడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా 124 నుంచి 139 మెగావాట్ల భారీ సామర్థ్యం కలిగిన పంపుసెట్లను వినియోగించడానికి డిజైన్ చేశాం. ఈ ప్రణాళిక తయారు చేయడానికి, అమలు చేయడానికి ఇంజనీర్లు, అధికారులు విదేశాలకు వెళ్లి సంపూర్ణ అధ్యయనం చేశారు. పూర్తి అవగాహనతో పనులు చేపట్టారు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగాయి. ఈ ప్రాజెక్టు పనుల్లో రేయింబవళ్లు కష్టపడుతున్న అధికారులు, ఇంజనీర్లకు నా హృదయపూర్వక అభినందనలు’ అని తెలిపారు కేసీఆర్.