Home > Flash News > కాళేశ్వరమే మాకు ప్రాధాన్యం మంత్రి హరీష్ రావు

కాళేశ్వరమే మాకు ప్రాధాన్యం మంత్రి హరీష్ రావు

ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టుకు మించిన ప్రాధాన్యం తెలంగాణ ప్రభుత్వానికి మరొకటి లేదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. భూసేకరణ ప్రక్రియ, నిర్మాణపు పనులను మంత్రి జలసౌధ లో సమీక్షించారు.ఇక ప్రతి 15 రోజుల కోసారి కాళేశ్వరం పనులను సమీక్షిస్తానని ప్రకటించారు. భూసేకరణ కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నదని,అందువల్ల ఈ ప్రక్రియ ను వేగవంతం చేయాలని అన్నారు.

మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీ లు, పంప్ హౌజ్ లకు సంబంధించిన భూసేకరణ పనులను మంత్రి హరీశ్ రావు సమీక్షించారు. 2018 జూన్ కల్లా సుందిళ్ళ బ్యారేజీ పనులు పూర్తి కావలసిందేనని ఆయన అన్నారు.24 గంటలు పని చేయాలని మూడు షిఫ్ట్ లలో పని చేయించాలని వివిధ ఏజెన్సీ లను హరీష్రావు ఆదేశించారు. వచె ఏడాది ఖరీఫ్ లో రైతులకు నీరు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించినారని మంత్రి గుర్తు చేశారు. లక్ష్యాల మెరకు ఇరిగేషన్ అధికారులు అటు ఏజెన్సీ లు పని చేయాలని సూచించినారు. ఎలాంటి అలసత్వాన్ని సహించబోమని మంత్రి హెచ్చరించినారు. ఏజెన్సీలకు కూడా ఇది ఒక చాలెంజింగ్ ప్రాజెక్టని చెప్పినారు. ఆయా పనుల షెడ్యూలుకు ముందే పూర్తి చేస్తే సంబంధిత ఏజెన్సీలకు ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్హ్తింపు లభిస్తుందని మంత్రి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మామూలుగా అయితే అయిదేళ్లకు పూర్తవుతుందని, తెలంగాణ ప్రజల తాగు, సాగు నీటి అవసరాల నేపథ్యం లో ఈ ప్ర్రజెక్టును పద్దెనమిది నెలల్లోనే పూర్తి చేసే లక్ష్యం తో సి‌ఎం కే‌సి‌ఆర్ పని చేస్తున్నారని హరీష్ రావు తెలిపారు.

ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్లతో పాటు ఎస్ఇ, ఇఇలు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల , అన్నారం బ్యారేజీలు, పంప్ హౌజ్ ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఆదేశించారు. ఇరిగేషన్, రెవిన్యూ అధికార యంత్రాంగo సమన్వయంతో ఈ పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు కోరారు.

ప్రతివారం భూసేకరణ పురోగతిని పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లా కలెక్టర్లు సమీక్షించాలని హరీశ్ రావు కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సీఎం కెసిఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.భూసేకరణ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. దీనికే ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కోరారు.మూడు బ్యారేజీలు, పంపు హౌజ్ ల సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ పనులన్నీ ఏకకాలంలో జరగాలని మంత్రి సూచించారు. సమీకృతంగా పనులు పూర్తయ్యలా ప్రయత్నించాలని తెలిపారు. బ్యారేజీ లు, పంపుహౌజ్ ల నిర్మాణం పూర్తి చేయడానికి నిర్ణీత కాలవ్యవధిని ఇదివరకే ఖరారు చేశారని మంత్రి చెప్పారు.ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల సలహాదారు పెంటారెడ్డి, డిజైన్స్ సి.ఈ. నరేంద్ర రెడ్డి, కాళేశ్వరం సి.ఈ. ఎన్. వెంకటేశ్వర్లు, ప్రాజెక్టుల డిజైన్స్ నిపుణుడు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated : 22 July 2017 7:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top