kalvakuntla Himanshu taught lessons to public school students at Oakridge International School
mictv telugu

విద్యార్థులకు సీఎం మనువడు హిమాన్షు పాఠాలు

October 30, 2022

తెలంగాణ సీఎం కేసీఆర్ వారసుడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు తాజాగా ఉపాధ్యాయుడి అవతారం ఎత్తాడు. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఒక కార్యక్రమంలో సందడి చేశాడు. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి అంశంపై హైదరాబాద్ నగరంలోని ఖాజాగూడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బోధన చేశాడు. గతంలో కేసీఆర్ కూడా అధ్యాపకుడిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మనవడు కూడా అదే బాటలో కనిపించాడు. హిమాన్షు రావు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకుంటున్నాడు. ఇటీవల హిమాన్షు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచి తన సత్తా చాటుకున్నాడు. క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ (సీఏఎస్) విభాగానికి అధ్యక్షుడు కూడా అయ్యాడు.

తాజాగా శనివారం ఖాజాగూడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సుస్థిర అభివృద్ధి, ప్రగతి లక్ష్యాలు అనే సబ్జెక్టుపై పాఠాలు చెప్పాడు. దీనిపై హిమాన్షు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప‌లు వివ‌రాలు వెల్లడించాడు. “శనివారం కూడా పనిచేయాలంటే విసుగొస్తుందని ఎవరు చెప్పారు? ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి కార్యాచరణను పిల్లలకు వివరించే అవకాశం వచ్చింది” అని త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపాడు. తెలంగాణలో ఇప్పుడు హిమాన్షు టాపిక్ హాట్ హాట్ గా మారుతోంది. తండ్రికి తగ్గ తనయుడు, తాతకు తగ్గ మనవడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి.