ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణస్వీకారం - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణస్వీకారం

October 29, 2020

ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ‌ప్రమాణస్వీకారం చేశారు. మండలిలో, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. కవితతో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. 

ఇటీవల జరిగిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కవిత ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే. 824 మంది ఓటర్లు ఉండగా, 823 మంది ప్రజాప్రతినిధులు ఓటు వేశారు. వీరిలో ఇద్దరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారు. దీంట్లో అత్యధికంగా 728 ఓట్లు కవితకు వచ్చాయి. ఈ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవితను కలిసిన ‌జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌‌గా‌ నిర్దారణ కావడంతో.. ఆమె క్వారంటైన్‌లోకి వెళ్లారు. దీంతో ఆమె ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయలేదు. తన క్వారంటైన్ సమయం ముగియడంతో ఈ రోజు ఆమె ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు.