నేడు ఎమ్మెల్సీగా కవిత ప్రమాణస్వీకారం - MicTv.in - Telugu News
mictv telugu

నేడు ఎమ్మెల్సీగా కవిత ప్రమాణస్వీకారం

October 29, 2020

telangana

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే. 824 మంది ఓటర్లు ఉండగా, 823 మంది ప్రజాప్రతినిధులు ఓటు వేశారు. వీరిలో ఇద్దరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారు. దీంట్లో అత్యధికంగా 728 ఓట్లు కవితకు వచ్చాయి. 

ఈ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవితను కలిసిన ‌జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌‌గా‌ నిర్దారణ కావడంతో.. ఆమె క్వారంటైన్‌లోకి వెళ్లారు. దీంతో ఆమె ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయలేదు. తన క్వారంటైన్ సమయం ముగియడంతో ఈ రోజు ఆమె ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం12:45 నిమిషాలకు కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేస్తారు. హైదరాబాద్‌లోని శాసనమండలిలో చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆమెతో ప్రమాణం చేయించనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరుకానున్నారు.