ఓడినా.. గెలిచినా.. ప్రజా‌సేవకే నా జీవితం అంకితం.. - MicTv.in - Telugu News
mictv telugu

ఓడినా.. గెలిచినా.. ప్రజా‌సేవకే నా జీవితం అంకితం..

May 24, 2019

దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కల్వకుంట్ల కవిత ఓటమి పాలయ్యారు. కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 62వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల్లో ఓటమిపై కవిత స్పందించారు.

‘ఎన్నికల్లో ఓడినా, గెలిచినా నా జీవితం ప్రజలకే అంకితం. ఐదేళ్ల పాటు సేవ చేసే అవకాశం ఇచ్చిన నిజామాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు. ఎన్నికల్లో గెలుపొందిన అరవింద్‌కు శుభాకాంక్షలు. నా గెలుపు కోసం కష్టపడిన అందరికి ధన్యవాదాలు’ అంటూ కవిత ట్వీట్ చేశారు. లోక్‌సభ ఎన్నికల బరిలో నిజామాబాద్‌లో రైతులు అధిక సంఖ్యలో పోటీలో నిలిచారు. అందరి చూపు ఈ నియోజకవర్గం వైపే వెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో బీజేపీ అభ్యర్థి అరవింద్ చేతిలో కవిత ఓడిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.