హోం క్వారంటైన్‌లో కల్వకుంట్ల కవిత..  - MicTv.in - Telugu News
mictv telugu

హోం క్వారంటైన్‌లో కల్వకుంట్ల కవిత.. 

October 13, 2020

Kalvakuntla's kavita in the home quarantine ..

తాను ఐదు రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉంటున్నట్టు నిజామాబాద్‌ ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత వెల్లడించారు. ఈ మేరకు ఆమె మంగళవారం ట్వీట్‌ చేశారు.  ఈ ఐదు రోజుల వరకు తన కార్యాలయానికి ఎవరూ రావద్దని కవిత అభ్యర్థించారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవితను కలిసిన ‌జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌‌గా‌ నిర్దారణ కావడంతో.. ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కరోనా బారినపడ్డ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దీంతో నెటిజన్లు కవితను త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. 

కాగా, అంతకుముందు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీశ్రేణులకు, కార్యకర్తలకు, ప్రజలకు, నాయకులకు మనవి చేస్తూ ట్వీట్ చేశారు. తనకు ర్యాపిడ్ టెస్ట్‌లో నెగటివ్ రాగా, RTPCR టెస్టులో కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయిందని పేర్కొన్నారు. గత ఐదు రోజులుగా తనతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నవారు హోమ్ ఐసోలేషన్‌తో పాటు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు.