Kalyan Ram's 'Bimbisara' first review
mictv telugu

కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ ఫస్ట్ రివ్యూ

August 4, 2022

నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన చిత్రం బింబిసార ఆగస్టు 5న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉందని ఇప్పటికే దర్శకుడు తేల్చి చెప్పాడు. టీజర్, ట్రైలర్‌లకు మంచి స్పందన రాగా, భారీ హిట్ సాధిస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యులు ఉమైర్ సంధు మూవీ ఫస్ట్ రివ్యూను తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. సినిమా చాలా బాగుందని, కళ్యాణ్ రామ్‌కి మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుందని నమ్మకం వెలిబుచ్చారు. టైమ్ ట్రావెల్‌తో కూడిన కథ ఇదనీ, క్రీస్తు పూర్వం 500 నాటి కాలంలో ఉన్న త్రిగర్తల సామ్రాజ్యంతో మొదటి సగభాగం నడుస్తుందని వెల్లడించారు. రెండో భాగంలో అదే బింబిసార నేటి కాలంలో తన నిధిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ అని స్పష్టం చేశారు. దీంతో చిత్ర బృందానికి, అభిమానులలో ఉత్సుకత పెరిగింది.