కమల్ కాబోయే సిఎం…?
తమిళనాడులో ఏం జరుగుతుందని ఎవరైనా ఎవరినైనా అడిగితే…. అస్సలు అర్థం కావడం లేదంటారు కావొచ్చు. అంతే కాదు…ఇప్పుడు అమ్మ లేదు. చిన్నమ్మ జైళ్లో ఉంది….. జరగడానికి అక్కడేముంది అని చెప్పే వారూ ఉంటారు. ఇదిగో నేనూ ఉన్నానని సూపర్ స్టార్ రజనీ కాంత్ ఫ్యాన్స్ తో మీట్ల మీద మీట్లు పెడుతున్నాడు. త్వరలో పార్టీ పెడ్తారనే ప్రచారానికి తెర తీశారు. దాన్ని అట్లాగే వదిలేసి… అమెరికాకు పోయారు. ‘‘కాలా’’ సిన్మాలో కసిగా నటించే బీజీలో పడ్డారని అక్కడి మీడియా… ఆయన ఫ్యాన్సూ… ఫ్యామిలీ మెంబర్లు చెప్తున్నారు.ఈ ’’కాలా‘‘ పోలిటికల్ ఎంట్రీ గురించి ఇంకా కన్ఫామ్ కాక పోయినా… ’’స్వాతిముత్యం‘‘ మాత్రం అస్సలు ఆగడం లేదు.
ఈ మధ్య కాలంలో స్టాలిన్, పన్నీర్ సెల్వంల కంటే వైవిధ్య నటుడు కమల్ హాసన్ అస్సలు సిసలైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మంత్రుల అవినీతిని బయటపెడ్తానని సవాల్ విసురుతూ పళని స్వామికి పక్కలో బల్లెంలా తయారవుతున్నారు. ఈ ఘాటు కామెంట్ల వల్లనే ఈయన ఇంటి వద్ద భద్రత కూడా భారీగా పెంచారని టాక్. తమిళ స్టార్లు చానా మంది రజనీ పోలిటికల్ ఎంట్రీపై తీవ్రంగా స్పందించారు. కానీ రాజనీ కాంత్ కు మద్దతుగా మాట్లాడిన నటుడు కూడా కమలే.
ఇప్పుడు తమిళనాట ఏనోట విన్నా కమల్ గురించేనట. ఒక వేళ పార్టీ అంటూ పెడితే కమల్ పెడితే బావుంటుంది. అదీగాక ప్రభుత్వాన్ని కడిగే పారేస్తున్నారు. ఇంకొద్ది రోజులైతే పళని స్వామిన ఏకీ పారేస్తాడనే ధీమా కూడా ఇస్తున్నాడట. అంతే కాదు కమల్ హాసన్ తమిళనాట నడిచిన ద్రవిడ ఉద్యమ స్వభావానికి తగినట్లుగా వ్యవహరిస్తున్నారు. చాలా చైతన్యవంతమైన రోల్ ప్లే చేస్తున్నారు. జల్లి కట్టు నుండి మొదలు పెడితే వందేండ్ల తర్వాత వచ్చిన మద్రాస్ తాగునీటి సమస్య వరకు అన్నీంటి గురించి కామెంట్ చేస్తున్నారు. వీలైతే ప్రభుత్వంతో కయ్యానికి సై అంటున్నారు.
వెండి తెరపైనే కాదు పొలిటికల్ లైఫ్ లో కూడా అన్ని రసాలు పండిస్తానని హామీ ఇస్తున్నారీ ’’ఇంద్రుడు చంద్రుడు.’’ చాలా విషయాల గురించి బోల్డ్ గా మాట్లాడుతున్న కమల్ సాబ్. తన రాజకీయ కార్యాచరణ గురించి… ఇప్పటికైతే ఏమీ చెప్పలేదు. ముందు ముందు ఏం చేప్తాడో… ఏం చేస్తారో చూడాలి మరి. ఇప్పటి వరకైతే గోడలమీద అతికించిన పోస్టర్లపై తమిళనాడు కాబోయే సిఎంగా కమల్ పేరు ఖాయం అయింది.