పొలిటికల్ ఎంట్రీపై బలమైన కారణం చెప్పిన కమల్ హాసన్ - MicTv.in - Telugu News
mictv telugu

పొలిటికల్ ఎంట్రీపై బలమైన కారణం చెప్పిన కమల్ హాసన్

November 8, 2019

నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావడానికి వెనక ఉన్న బలమైన కారణాన్ని బయటపెట్టారు. తాను మక్కల్ నీది మయ్యం పార్టీ పెట్టడానికి తన తండ్రి ఆకాంక్షే అని వెల్లడించారు. రాజకీయాల్లోకి రావాలనే తన తండ్రి కోరికే తననను ఆ దిశగా అడుగులు వేయించిందన్నారు.పరమకుడిలో ఏర్పాటు చేసిన కమల్ తండ్రి శ్రీనివాసన్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

Kamal Haasan.

గత్యంతరం లేకో, మరో ఉద్దేశంతోనే తన రాజకీయ ప్రవేశం జరగలేదని గుర్తు చేశారు. స్వాంతంత్య్ర సమరయోధుల కుటుంబంలో పుట్టిన తాను ప్రజాసేవ కోసం ముందుకు వచ్చానని చెప్పారు. గతంలో స్వాతంత్య్ర పోరాటంలో తాను పాల్గొన్నానని, ఇప్పుడు మరోసారి ఉద్యమం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో నాన్నను చూసి నేర్చుకోవాలన్నారు. అయితే తన కుటుంబంలో తండ్రికి తప్ప మరెవరికి తాను రాజీకీయాల్లోకి రావడం ఇష్టంలేదని కమల్ వెల్లడించారు.