అంతా ఓకే..ఆస్పత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జ్ - MicTv.in - Telugu News
mictv telugu

అంతా ఓకే..ఆస్పత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జ్

November 25, 2022

 

ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన కమల్ హాసన్ నేడు డిశ్చార్జి అయ్యారు. జ్వరం, దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తల్లెత్తడంతో ఆయన శుక్రవారం ఉదయం శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ ఆసుపత్రిలో చేరారు. రెండు రోజుల పాటు ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం కోలుకోవడంతో డిశార్చ్ చేశారు. కొన్నిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో కమల్ జాయిన్ అయ్యారనే వార్తలు వచ్చినప్పటి నుంచి అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆరోగ్యంతో బయకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల విక్రమ్ చిత్రంలో హిట్ అందుకున్న కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ -2 సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు బిగ్ బాస్ సీజన్-6 తమిళ్ రియాలిటీ షోకు హోస్ట్ గా కమల్ వ్యవహరిస్తున్నారు