Kamal Haasan is unwell..moved to hospital
mictv telugu

కమల్‎హాసన్‌కు అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు

November 24, 2022

ప్రముఖ నటుడు కమల్ హాసన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే చెన్నై పోరూరు రామచంద్ర ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. బుధవారం నుంచి తీవ్ర జ్వరంతో కమల్ హాసన్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. శ్వాస తీసుకోవడంలో కూడా కమల్ హాసన్ ఇబ్బంది పడుతుండడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై ఫ్యాన్స్ అందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. నిన్న హైదరబాద్‌లో పర్యటించిన కమల్ హాసన్ కళాతపస్వి కె.విశ్వనాథన్‌ను కలిసి వెళ్లారు. గతంలో కమల్ హాసన్ కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారు.