అనుమతి లేకుండా కమల్ ముద్దు పెట్టాడు..నటి రేఖ - MicTv.in - Telugu News
mictv telugu

అనుమతి లేకుండా కమల్ ముద్దు పెట్టాడు..నటి రేఖ

February 26, 2020

gn vbn vbh

ప్రముఖ నటుడు కమల్ హాసన్, రేఖ నటించిన ‘పున్నగై మన్నన్‌’ సినిమా 1986లో విడుదలై మంచి విజయం సాధించింది. కె బాలచందర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్‌-రేఖ మధ్య ఓ ముద్దు సీన్ ఉంటుంది. ఆ ముద్దు సీన్ గురించి గతంలో రేఖ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. తన అనుమతి లేకుండానే బాలచందర్‌ చెప్పినదాని ప్రకారం కమల్‌ తనని ముద్దు పెట్టుకున్నారని రేఖ తెలిపారు. ఒకవేళ ముద్దు సీన్ గురించి ముందే చెప్పినట్లు అయితే తాను అంగీకరించేదాన్ని కాదని ఆమె తెలిపారు. 

ప్రస్తుతం రేఖకు సంబంధించిన ఈ ఇంటర్వ్యూ వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కమల్‌హాసన్‌ వెంటనే రేఖకు క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రేఖ స్పందిస్తూ.. ‘పున్నగై మన్నన్‌’ సినిమా గురించి ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఎందుకు వైరల్ అవుతుందో అర్థం కావడం లేదన్నారు. ఎన్నో సంవత్సరాల క్రితం అది జరిగింది. ఇప్పుడు ఆ ముద్దు సీన్ గురించి మాట్లాడి పాపులారిటీని పొందాలనుకోవడం లేదన్నారు. తాను ప్రస్తుతం సినిమాలు, వెబ్‌ సిరీస్‌లలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నానని తెలిపారు. దీనిపై కమల్ స్పందించాల్సిఉంది.

gnvn