గుజరాతీ భాష నేర్చుకుంటున్న కమల్ - MicTv.in - Telugu News
mictv telugu

గుజరాతీ భాష నేర్చుకుంటున్న కమల్

November 19, 2019

కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన పాత్ర కోసం ఎంతగా కష్టపడతారో తెలిసిందే. ఆ పాత్రలో లీనం అవడానికి ఆయన తనను తాను ఏవిధంగా మలుచుకుంటారో తెరమీద ఆయన నటనను చూస్తే తెలిసిపోతుంది. పాత్రలో జీవించాడు అన్నంత ఇదిగా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడంలో కమల్ హాసన్ దిట్ట. తాజాగా ఆయన ‘ఇండియన్ 2’ సినిమాలో నటిస్తున్నారు. ఇన్ని సినిమాలు చేసిన అనుభవం ఉంది.. ఏ పాత్ర అయినా అవలీలగా చేసేస్తాను అని ఆయన ఏనాడూ అనుకోరు. ఏ సినిమానైనా ఆయన కొత్తగానే భావిస్తారు. ఈ సినిమా కోసం కూడా ఆయన చాలా కష్టపడుతున్నారు.  ఇందులో కమల్ హాసన్ 90 ఏళ్ల వృద్ధుడిగా కనిపిస్తున్నారు. వృద్దుడిగా నటించడం అంటే మాములు విషయం కాదు.  చాలా కష్టపడాల్సి ఉంటుంది.  90 ఏళ్ల వయసులో వ్యక్తులు ఎలా ఉంటారు.. వారి కదలికలు ఎలా ఉంటాయి అనే విషయాలపై అవగాహన ఉండాలి.  పైగా ఇందులో కమల్ స్వాతంత్య్ర సమరయోధుడు కాబట్టి, అన్ని రకాల వేరియేషన్స్‌ను చూపించి మెప్పించే ప్రయత్నంలో పడ్డారు.  

Kamal Haasan.

ఈ సినిమాలో కథ పరంగా కమల్ కొంత గుజరాతీ భాషలో మాట్లాడాల్సి వస్తుంది.  దానికోసం కమల్ గుజరాతీ భాషను నేర్చుకుంటున్నారు.  ఓ ట్యూటర్‌ను పెట్టుకుని భాషను నేర్చుకుంటున్నారట. వచ్చే ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయడానికి శంకర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తుండగా కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.