హిందీ భాషపై కమల్ హాసన్ వ్యాఖ్యలు.. అడ్డొస్తే మాత్రం - MicTv.in - Telugu News
mictv telugu

హిందీ భాషపై కమల్ హాసన్ వ్యాఖ్యలు.. అడ్డొస్తే మాత్రం

May 17, 2022

విశ్వనటుడు కమల్ హాసన్ హిందీ భాషపై కీలక వ్యాఖ్యలు చేశారు. ”హిందీ భాషను వ్యతిరేకించను. అలాగని నా మాతృభాష తమిళానికి అడ్డుపడితే మాత్రం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను” అని ఆయన అన్నారు. తాజాగా కమల్ హాసన్ నటించిన చిత్రం ‘విక్రమ్’. ఈ సినిమాకు సంబంధించి సోమవారం చైన్నైలో ట్రైలర్, పాటల విడుదల కార్యక్రమం జరిగింది.

కమల్ హాసన్ మాట్లాడుతూ.. “సినిమా, రాజకీయాలు కవల పిల్లలు. అదే నేను చేస్తున్నా. తమిళం వర్ధిల్లాలి అని చెప్పడం నా బాధ్యత. దీనికి ఎవరు అడ్డువచ్చినా ఎదుర్కొంటా. దీనికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. మాతృభాషను మరవకండి. హిందీకి వ్యతిరేకినని చెప్పను. గుజరాతీ, చైనీస్ భాషలు కూడా మాట్లాడండి” అని ఆయన అన్నారు.

ఇక, సినిమా విషయానికొస్తే..ఈ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ తెరకెక్కించగా, అనిరుధ్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో కమల్ హాసన్‌తోపాటు ఫహద్, విజయ్ సేతుపతి, సూర్య కూడా నటించారు. ఈ సినిమా జూన్ 8న విడుదల కానుంది.