బౌద్ధ మతం స్వీకరించిన కమల్ హాసన్ కూతురు...! - MicTv.in - Telugu News
mictv telugu

బౌద్ధ మతం స్వీకరించిన కమల్ హాసన్ కూతురు…!

July 28, 2017

కుల మతాల గురించి ఏమాత్రం పట్టింపు లేని వ్యక్తి సినీ నటుడు కమల్ హాసన్. అదే బాటలోఆయన చిన్న కూతురు అక్షర హాసన్ పయనిస్తోంది. బౌద్ధ మతాన్ని స్వీకరించి సంచలనం సృష్టించింది. కమల్ హాసన్ దేవుడిని నమ్మడు కానీ.. పెద్ద కూతురు శృతి హాసన్ కు మాత్రం భక్తి ఎక్కువే. చిన్న కూతురు అక్షర హాసన్ కు కూడా అంతగా భక్తి లేదు.. కానీ కొన్ని సంఘటనల కారణంగా బౌద్ధ మతాన్ని స్వీకరించింది . ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిది అక్షరహాసన్. నా సోదరిలాగే నేను కూడా నాస్తికురాలినే.. అయితే బుద్దిజంపై ఆసక్తితో దాన్ని ఆచరిస్తున్నానని తెలిపింది.