కమల్, నగ్మ ఏం మాట్లాడుకున్నారు?  - MicTv.in - Telugu News
mictv telugu

కమల్, నగ్మ ఏం మాట్లాడుకున్నారు? 

September 5, 2017

కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తున్నాడనే వార్త సంచలనం సృష్ఠిస్తోంది. తాజాగా అతనితో సినీ నటి, కాంగ్రెస్ నేత నగ్మా భేటీ అవడం మరింత ఆసక్తికరంగా మారింది.  వీరిద్దరూ ఇటీవల చెన్నైలో గంట పాటు భేటీ అయ్యారు.  జాతీయ, తమిళ రాజకీయాలపై బాగా చర్చించుకున్నట్లు తెలుస్తోంది. రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం గురించి కూడా  మాట్లాడుకున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కమ్యూనిస్టులు తన బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇటీవల కమల్ చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను కాంగ్రెస్ లోకి రప్పించేందుకు నగ్మాను పంపారేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల కమల్ హాసన్ తమిళ రాజకీయాలను  తన ట్విట్టర్ ఖతా ద్వారా వరుసగా విమర్శిస్తున్న విషయం విదితమే. ఒక ప్రైవేట్ ఫంక్షన్ కు వెళ్ళినప్పుడు తనే స్వయంగా ఇది ఒట్టి ఫంక్షన్ మాత్రమే కాదు తన రాజకీయ ప్రమేశానికి నాంది అని అన్నాడు. అప్పటినుంచి కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తున్నాడనే వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా నగ్మా మీటింగ్ చాలా మందిలో చాలా అనుమానాలను రేకెత్తిస్తోంది. కమల్ కొత్తగా పార్టీ పెడతాడా, పెడితే నగ్మాను తన పార్టీలోకి తీసుకుంటాడా ?? అనే ఎక్స్ పెక్టేషన్స్ పబ్లిక్ లో బలంగా వినిపిస్తున్నాయి.