తమిళనాట వివాదాలకు కేంద్రబిందువుగా కమల్ హాసన్..! - MicTv.in - Telugu News
mictv telugu

తమిళనాట వివాదాలకు కేంద్రబిందువుగా కమల్ హాసన్..!

July 17, 2017


లోక నాయకుడు,భారతీయుడు…తమిళనాడు ప్రభుత్వంపై చేసిన కొన్ని వాఖ్యలు వివాదస్పదంగా మారాయి,తమిళనాడు రాజకీయంపై కమల్ తనదైన శైలిలో విరుచుకు పడ్డాడు. తమిళనాడు ప్రభుత్వంలోని అన్ని శాఖలలో అవినీతి పెరిగిపోయిందని ఇటీవల కమల్ హాసన్ మీడియాతో చెప్పారు,ఈ విషయంమీద తమిళనాడులోని పలువురు మంత్రులు మండిపడ్డారు,రాజకీయాలపై మాట్లాడే అర్హత కమల్ కు లేదన్నారు,కొందరైతే ఆయనను అట్రాసిటీ చట్టం కింద అరెస్ట్ చెయ్యాలని చెప్పారు.ప్రభుత్వంపై ఇన్ని విమర్శలు చేస్తున్న కమల్..సినిమాల్లో సంపాదించిన దానిలో గవర్నమెంట్ కు పన్ను సక్రమంగా కడుతున్నాడో లేదో ఆడిట్ చేపిస్తామని ఓ మంత్రి వార్నింగ్ కూడా ఇచ్చారు.
కమల్ కు స్టాలిన్ మద్దతు..!
కమల్ చేసిన వాఖ్యలపై చర్యలు తీసుంటామని పలువురు మంత్రులు చెప్పడాన్ని డియంకె అధ్యక్షుడు స్టాలిన్ తప్పు బట్టారు, , అన్ని శాఖల్లో అవినీతి ఉందని మేం ఎప్పన్నుంచో చెబుతున్నాం..మరి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు, మీరు బెదిరించడానికి కమల్ అల్కగ దొర్కిండా కేసులు పెడ్తరా . ప్రభుత్వం అవినితిపై మాట్లాడే హక్కు ఇతరులకు ఉన్నట్టే కమల్‌హాసన్‌కు కూడా ఉందని సమర్ధించారు.
కమల్ బిగ్ బాస్ షో పై పలు విమర్శలు..!
తమిళంలో కమల్ చేస్తున్న బిగ్ బాస్ షో పై అక్కడి హిందూ సంస్థ అభ్యంతరం తెలిపింది,వెంటనే ఆ షోను ఆపివేయాలని..తమిళ సంసృతిని దెబ్బ తీసే విదంగా ఆ షో ఉందంటూ కమల్ పై పలువురు మండిపడ్డారు..ఈ విషయం పై కమల్ హాసన్ మాట్లాడుతూ…అది సామాజిక భాద్యతతో కూడిన ప్రోగ్రాం అని.. కావాలంటే నన్ను అరెస్ట్ చేస్కొండి..కానీ ఆ షో ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఇవిలా ఉంటే మలయాళనటి కిడ్నాప్ కేసులో ఆమె పేరును దాచాల్సిన అవసరంలేదని…ఆమె పేరును మీడియాతో చెప్పి అదో వివాదానికి దారి తీసాడు కమల్ హాసన్.ఇలా వరుస వివాదాలతో వార్తల్లో ఎక్కుతూ కమల్ హాసన్ తనకు బాగానే పబ్లిసిటీ తెచ్చుకుంటున్నాడు అని కొందరు అనుకుంటుంటే,ఇంకొందరేమో ..ఆయనకు ఎందుకచ్చిన తల్కాయ నొప్పులివన్ని మంచిగ సిన్మాలు జేస్కోక అని అభిప్రాయపడుతున్నారు.