హీరో కమల్ హాసన్ రాజకీయాల్లో రాబోతున్నారా..?నేనే ముఖ్యమంత్రి అని ఎందుకు ట్విట్ చేశారు..?రాజకీయాల్లో వచ్చేలా సంకేతమే ఈ ట్విట్టా..? ఇప్పుడిదే తమిళనాడు పొలిటికల్ సర్కిల్ హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. నేనే ముఖ్యమంత్రి అని కమల్ కు ట్విట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిదంటే..?
మంగళవారం రాత్రి కమల్ హాసన్ 11 లైన్ల మేర ఓ తమిళ పద్యాన్ని ట్విటర్లో పోస్టు చేశారు. అందులో ప్రత్యేకించి.. నన్ను ఓడిస్తే… నేను అంతకంటే బలంగా తిరగపడతా.. తల్చుకుంటే, నేనే ముఖ్యమంత్రి అన్న వర్డ్స్ హైలైట్ అయ్యాయి. పైగా ‘‘రేపు ఆంగ్లపత్రికలు దీనిపై ఓ ప్రత్యేక సందేశాన్ని ప్రచురిస్తాయనిని కూడా కామెంట్ చేశారు.దీంతో . అంతే కమల్ రాజకీయ ప్రవేశంపై పుకార్లు షికార్లు చేశాయి. ఆ తర్వాత కమల్ ఓ పత్రికా ప్రకటనతో ముందుకొచ్చారు. తాను ప్రో కబడ్డీ లీగ్ ఐదో సీజన్‌లో తమిళ తలైవాస్ జట్టుకి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నానని చెప్పాడు. ఈ విషయాన్ని ప్రకటించేందుకే ఆయన నేర్పుగా ట్విటర్‌ను ఉపయోగించుకున్నారు.
ఇది తెలుసుకోకుండా నేర్పు అనే వర్డ్ ఉండే సరికి రాజకీయాల్లోకి వచ్చేందుకు సంకేతమని అంతా భావించారు. దీనికి కారణం కూడా ఉందిలే. ఇటీవల ఏఐఏడీఎంకే ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోనూ అవినీతి జరుగుతోందంటూ వ్యాఖ్యానించడంతో అక్కడి మంత్రులంతా కమల్‌పై కత్తులు నూరారు. కొందరు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించగా… మరికొందరు కమల్ వ్యక్తిగత జీవితంపైనా, ప్రస్తుతం ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షో పైనా విరుచుకుపడ్డారు. దమ్ముంటే రాజకీయాల్లోకి వచ్చి సత్తా చాటుకోవాలంటూ సవాల్ విసిరారు. దీంతొ కమల్ నేనే సీఎం వ్యాఖ్యలపై ఒక్కసారిగా రాజకీయ అంచనాలు పెరిగాయి. మొత్తానికి ప్రొ కబడ్డీపై ట్విట్ తో తమిళ రాజకీయాల్లో అలజడి రేగింది.