మోదీపై ‘భారతీయుడి’ కన్నెర్ర - MicTv.in - Telugu News
mictv telugu

మోదీపై ‘భారతీయుడి’ కన్నెర్ర

October 18, 2017

లోక నాయకుడు కమల్ హాసన్  రాజకీయ నేతగా మారుతుండడంతో ఇతర రాజకీయ నాయకులపై బాగానే విరుచుకు పడుతున్నాడు. ‘నోట్ల రద్దు సమయంలో మోదీకి మద్దతు ఇచ్చి చాలా తప్పుచేశాను., దానికి  ప్రజలు నన్ను క్షమించాలని’ అని కమల్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో అన్నాడు. కేవలం ధనవంతుల కోసమే మోదీ నోట్లు రద్దు నిర్ణయం తీసుకున్నాడని ఆయనపై మండిపడ్డారు.

నోట్ల రద్దుతో కేవలం రాజకీయ నాయకులకు లబ్ధి జరిగిందే తప్ప, సామాన్య ప్రజానీకానికి ఎటువంటి ప్రయోజనమూ కలగలేదని అన్నారు. మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం కారణంగా ప్రజలెంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తుంటే బాధేస్తుందని అన్నారు. ‘నోట్ల రద్దుకు సమర్థించవద్దని, నా మిత్రులు నాకు ముందే చెప్పారు, అయినా నేను వినక తప్పు చేశాను’ అని కమల్ విచారం వ్యక్తం చేశాడు.