కమల్ పార్టీ రేపే షురూ.. హాజరు కానున్న కేజ్రీ, మమత - MicTv.in - Telugu News
mictv telugu

కమల్ పార్టీ రేపే షురూ.. హాజరు కానున్న కేజ్రీ, మమత

February 20, 2018

విలక్షణ నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తానని చెప్పడం, రాజకీయ ప్రకటన చేయడం రోజూ చూస్తేనే ఉన్నాం. ఆయన బుధవారం తన పార్టీని ప్రారంభించనున్నారు. మదురై నగరంలోసాయంత్రం పలువురు రాజకీయ నేతల సమక్షంలో ఆయన పార్టీ పేరును, లక్ష్యాలను వివరించనున్నారు.

తను ఎవరికీ వ్యతిరేకిస్తున్నదీ, ఎవరికి మద్దతిస్తున్నదీ వెల్లడిస్తారు. అంతకు ముందు ఆయన రామేశ్వరం నుంచి చిన్నపాటి యాత్ర చేస్తారు. కాగా మదురైలో జరిగే కార్యక్రమానికి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తోపాటు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్ర, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా వస్తున్నారు.

పార్టీ ఏర్పాటు సందర్భంగా కమల్ వారికి విందు ఇస్తున్నారు. గతంలో కేజ్రీవాల్‌.. కమల్‌హాసన్‌ను రాజకీయాల్లోకి రావాలని కోరారు. వీరిద్దరూ కలిసి అవినీతి, మతోన్మాదం తదితర అంశాలపై చర్చలూ జరిపారు. అయితే కమల్ తన పార్టీ ప్రారంభానికి తమిళ పార్టీల నేతలను పిలవలేదని తెలుస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకేలు బీజేపీతో చేతులు కలుపుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అంటే గిట్టని కమల్ సహజంగానే వారిని పిలవలేదని భావిస్తున్నారు.