మాంచి ఊపుమీదున్న ‘భారతీయుడు’..... - MicTv.in - Telugu News
mictv telugu

మాంచి ఊపుమీదున్న ‘భారతీయుడు’…..

July 21, 2017

ఇన్నాళ్లు వెండి తెరపై దశవతారాలను మించి చూపించి… శెభాష్  అన్పించుకున్న ఈ భారతీయుడు ఇప్పుడు  తమిళనాడు అధికార పార్టీకి వణుకు పుట్టిస్తున్నట్లుంది. వెండి తెరపై  ఎన్ని స్టెప్పులేసినా… స్టంట్లు వేసినా అంత మజా లేదని అనుకున్నట్లుంది… అందుకే నిజ జీవితంలో దానికి కొన్ని రెట్లు మించి చేస్తున్నారు……

ఈ విషయం అంతా ఎవరి గురించో మీకు ఇప్పటికే అర్థం అయి ఉంటుంది. తమిళ స్టార్ కమల్ హాసన్ గురించే.  చాలా విషయాలపై ఆయన కామెంట్లు చేస్తున్నారు. జల్లి కట్టు విషయంలో మాట్లాడారు. ఒకే బాగుందన్నారు అక్కడి జనాలు. అక్కడి ప్రభుత్వం కూడా సరేలే అన్నది.  రజనీకాంత్ రాజకీయ అరంగేంట్రం  గురించి కామెంట్ చేశారు ఒకే. తాజాగా తానే సిఎం అని కామెంట్ చేశారు…ప్రో కబడ్డీ కార్యక్రమానికి మెయిన్ వ్యాఖ్యతగా….  దీని నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి అదీ ఒకే… అయితే అన్నాడిఎంకే ప్రభుత్వంపై ఆయన చేసిన  అవినీతి రోపణలు…. రాష్ట్రాన్ని ఊపేస్తున్నాయి. ఈ మాట తమిళనాట  వేడి పుట్టించింది…. కయ్యి మంటూ తమిళనాడు అధికార పార్టీ నాయకులు ఆయనపైకి లేచారు. ఈయనను కాపాడేందుకు స్టాలిన్ రంగంలోకి దిగారు.. దమ్ముంటే నన్ను  అనండి… ఆయన్ను కాదని బాగా వెనకేసుకొచ్చారు.

తానుఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదంటున్న కమల్…. మంత్రుల అవినీతి గురించి పోస్టు కార్డులు రాయాలని… మెయిళ్లు చేయాలని మంత్రుల మెయిల్ ఐడీలు తన అభిమానులకు ఇచ్చారు. కుప్పలు తెప్పలుగా మెయిళ్లు వచ్చిపడ్తున్నాయట. అరే సిన్మాల్ల అంటే ఏదో అనుకోవచ్చు. నిజ జీవితంలోకూడా ఇట్లా ప్రకంపనలు చేస్తే ఎట్లా కమల్ సారు. ఏమైతేంది. సారు మాంచి ఊపుమీదున్నట్లుంది.