రాజకీయాల్లోకి వచ్చేశా.. - MicTv.in - Telugu News
mictv telugu

రాజకీయాల్లోకి వచ్చేశా..

August 31, 2017

తమిళనాడు రాజకీయాల్లో రసవత్తర ఘట్టానికి తెరలేచింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కమల్ హాసన్ రాజకీయ రంగం ప్రవేశం హడావిడి లేకుండా జరిగిపోయింది.. ! తాను రాజకీయాల్లోకి వచ్చేశానని ఈ నటుడు స్వయంగా ప్రకటించారు. బుధవారం  పెళ్లి విందుకు హాజరైన కమల్ ఈమేరకు వెల్లడించాడు..‘ఈ కార్యక్రమంల ఒట్టి పెళ్లి కార్యక్రమం మాత్రమే కాదు. నా రాజకీయ ప్రవేశం కూడా అనుకోండి. నా రాజకీయ ప్రయాణం మొదలైంది. మీరు.. ప్రతి విషయానికీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకండి. అసలు ఈ చేతగాని ప్రభుత్వాలను ఎన్నుకున్నది మీరే. డబ్బులు తీసుకుని దోపిడీ దొంగలకు ఓట్లేశారు. రూ. 500, రూ. 1000 నోట్ల ఐదేళ్ల కాలాన్ని అమ్మేసుకున్నారు..  ఇలాంటి కుళ్లు రాజకీయాలు పోవాలి.’’ అని కమల్ అన్నారు.

అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూడా కమల్ ఉతికి ఆరేశారు. ఈ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. అయితే కమల్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి రాలేదని, ఆయన పార్టీ పెట్టడానికి చాలా కాలం పట్టొచ్చని పరిశీలకులు అంటున్నారు.