కమ్యూనిస్టులే తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పిన మల్టీ టాలెంట్ నటుడు కమల్ హాసన్ వామపక్ష పార్టీలకు చేరువ అవుతున్నాడు. త్వరంలో సీపీఎం కోజికోడ్ లో నిర్వహించనున్న కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆ పార్టీలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా ప్రకటన చేసే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ మత రాజకీయాలు, దక్షిణ భారత రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దడం వంటి వాటికి వ్యతిరేకంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇటీవలే కేరళ సీం, సీపీఎం నేత పినరయి విజయన్ తో కమల్ సమావేశం కావడం,
తాను కాషాయ పాలిటిక్స్ కు దూరంగా ఉంటానని చెప్పడం తెలిసిందే. కమల్ సీపీఎంలో చేరతాడని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఇదివరకే ట్వీట్ చేశాడు. అయితే కమల్ సీపీఎంలో చేరడం వల్ల పెద్ద ప్రభావం ఉండదని, ఆయన సొంత రాష్ట్రమైన తమిళనాడులో ఆ పార్టీ నామమాత్రంగానే ఉందని పరిశీలకులు చెబుతున్నారు.