నిజాన్ని గొంతు కోశారు.. - MicTv.in - Telugu News
mictv telugu

నిజాన్ని గొంతు కోశారు..

September 7, 2017

పాత్రికేయురాలు గౌరి లంకేశ్ హత్యపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. నిజాన్ని గొంతుకోసి చంపేశారని ట్వీట్ చేశారు. ‘చర్చలో ఓడిపోతామనే భయంతో తుపాకీతో నిజం గొంతుకను చంపేశారు. దీనికి మించిన దారుణం మరొకటి లేదు. గౌరీ లంకేశ్ కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.. ’ అని కమల్ పేర్కొన్నారు. హిందుత్వ ఫాసిస్టు శక్తులను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. తనకు కమ్యూనిస్టులు మంచి స్నేహితులని కమల్ ఇటీవల కేరళ సీఎం పినరయి విజయన్ తో భేటీ సందర్భంగా చెప్పడం తెలిసిందే. రాజకీయాల్లోకి వచ్చేశానని ప్రకటించిన కమల్ ఇంతవరకు పార్టీ ఏర్పాటు ఊసెత్తడం లేదు. ఆయనను తమ గూటికి రప్పించుకోవడానికి కాంగ్రెస్ యత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ నేత, నటి నగ్మా ఇటీవల చెన్నైలో కమల్ ను కలవడం తెలిసిందే.