ఆ దేవుడే వెన్నుపోటు పొడిచాడు.. కమ్మరాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్  - MicTv.in - Telugu News
mictv telugu

ఆ దేవుడే వెన్నుపోటు పొడిచాడు.. కమ్మరాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ 

October 27, 2019

టీడీపీ, వైకాపా పార్టీల పాలిటిక్స్, విజయవాడ రౌడీలు, హత్యా రాజకీయాలు..  చంద్రబాబు, జగన్, లోకేశ్‌, బ్రాహ్మణి, పవన్ కల్యాణ్, మోదీ, అమిత్ షా..  మరెందరో.. అధికారం కోసం ఒకరు, అధికారాన్ని కాపాడుకోడానికి మరొకరు పన్నే పన్నాగాలు, ప్యాకేజీలు, వెన్నుపోట్లు..మొత్తంగా ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని వర్మ మనముందుకు తీసుకొస్తున్నాడు. ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ పేరుత తీస్తున్న తన తాజా చిత్రం ట్రైలర్‌ను ఆయన దీపావళి బాణసంచాకు జతగా ఈ రోజు విడుదల చేశారు. 

ఏపీ రాజకీయాల్లోని ప్రముఖ నేతలందరిపైనా ఆర్జీవీ గురిపెట్టినట్లు ట్రైలర్ చెబుతోంది. ‘ఆ దేవుడే నన్ను వెన్నుపోటు పొడిచాడు.. ఎవర్ని ఎలా డీల్ చెయ్యాలో నాకు బాగా తెలుసు’ అని చంద్రబాబు అంటున్నాడు.. ‘నేనూ విజయవాడలోనే ఉంటున్నానన్న విషయం మర్చిపోవద్దు…’ అని జగన్ హెచ్చిస్తున్నాడు. కులాల పేర్లనే టైటిల్‌గా పెట్టిన వర్మ ఈ చిత్రంలో వివాదాలు సృష్టించడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. దీనిపై ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.