అక్కా తమ్ముడు అనుబంధంతో మీ మైక్ టీవీలో వస్తున్న ‘మైసమ్మ.. మా అక్క మంచిది’ వెబ్‌సిరీస్ రెండో ఎపిసోడ్ వచ్చేసింది. ఈ ఎపిసోడ్ చాలా స్పెషల్. ఎందుకంటే పాటల మూట కనకవ్వ ఇందులో తన మాటలు కూడా వినిపించనుంది. అమ్మమ్మగా తన మనవడిని, మనవరాలిని చూడటానికి హైదరాబాద్ వస్తుంది. ఇంతవరకు పాటలు పాడిన కనకవ్వ తొలిసారి నటిస్తున్న వెబ్‌సిరీస్ ఇదే అవడం విశేషం. కనకవ్వ మనవడి ఇంటికి వస్తూ వస్తూ మైసమ్మకు పెళ్లి సంబంధం తెచ్చింది. అబ్బాయి ఫోటోలు కూడా తీసుకువచ్చింది. మరి మైసమ్మకు అమ్మమ్మ తెచ్చిన సంబంధం నచ్చుతుందా లేదా ఈ ఎపిసోడ్లో చూడాల్సిందే. ఇంకా ఇంట్లో కనకవ్వ చేసే సందడి ఇకపై మీకు సరికొత్తగా అలరించనుంది.
పెళ్లి అంటేనే ఇష్టంలేని మైసమ్మను కనకవ్వ పెళ్లికి ఒప్పించిందా లేదా? తమ్ముడిని సెట్ చేయాలి, అమ్మానాన్నకు ఇల్లు కట్టిచ్చి ఇవ్వాలని టార్గెట్లు పెట్టుకున్న మైసమ్మను కనకవ్వ ఎలా తన దారికి తెచ్చుకుందో ముందు ముందు చూస్తారు. రాత్రిపూట మనవడు, మనవరాలికి తన మధురమైన గాత్రంతో పాటలు కూడా పాడి వినిపించింది. ఇలా ఎన్నో ఉన్నాయి ఈ ఎపిసోడ్లో క్రింది లింకులో మొత్తం ఎపిసోడ్ చూడండి.