జానపద పాటలతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న పాటల మూట కనకవ్వ త్వరలో మరో పాటతో మీ ముందుకు వస్తున్నారు. ‘గురుజవన్నె పావురాలు’ పాటతో మిమ్మల్ని అలరించడానికి వస్తున్నారు. ఈ పాటకు సంబంధించి ప్రోమో విడుదల అయింది. ఆడనెమలి అంటూ కనకవ్వ ఏ పాట పాడినా అది రికార్డులు నెలకొల్పుతున్న విషయం తెలిసిందే. తన మట్టితనాన్ని ఎక్కడ చెరగనివ్వకుండా కనకవ్వ పాడుతున్న పాటలు ఎందరినో అలరిస్తున్నాయి. ఆమె పాటల్లో మట్టివాసనలు గుభాళిస్తాయి. పాటతో పాటు కనకవ్వ ఆట కూడా తోడైన ఈ పాట మిమ్మల్ని పలకరించడానికి ముస్తాబవుతోంది. అప్పటివరకు క్రింది లింకులో ప్రోమో చూడగలరు.