కణం ట్రైలర్ వచ్చేసింది... - MicTv.in - Telugu News
mictv telugu

కణం ట్రైలర్ వచ్చేసింది…

November 18, 2017

ఫిదా’ చిత్రంతో తెలుగు కుర్రకారును ఆకట్టుకున్న చిన్నది సాయిపల్లవి తాజా చిత్రం కణం మూవీ ట్రైలర్ రిలీజైంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈమూవీలో పల్లవి ప్రధాన పాత్ర పోషిస్తోంది. నాలుగేళ్ల కూతురికి తల్లిగా నటిస్తోంది. ప్రయోగాత్మక చిత్రంగా ఇప్పటికే తెలిసిన ఈ మూవీ హారల్, థ్రిల్లర్ కూడా.

ఇందులో తల్లీకూతుళ్ల మధ్య భౌతికపరమైన మాతృత్వ బంధాన్ని చూపారు. ఫిదా సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన సాయి పల్లవి ఇందులో ఎలా వుంటుదన్నదానికి చక్కని హింట్లు ఉన్నాయి. సస్పెన్స్‌న సన్నివేశాలతో ట్రైలర్‌ను  తీర్చిదిద్దారు. ఎవరో హత్యకు గురి కావడం, హంతకుడి కోసం పోలీసుల గాలింపు, భూతాల పూజలు చేయడం వంటివాటిని చూపారు. పాప చుట్టూ కథ తిరుగుతున్నట్లు కనిపిస్తోంది.

‘మా సారీ మా. నేను చేసింది తప్పే. అలా అని ఇది వద్దమ్మా.. ప్లీజ్‌’ అనే డైలాగ్‌తో.. నాగశౌర్య, సాయిపల్లవి పెళ్లితో ట్రైలర్‌ మొదలైంది.  ‘కృష్ణ నేను చెప్పేది వింటే నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. నువ్వు నమ్మలేకపోవచ్చు. కానీ అది నిజం.. నువ్వు అన్ని మర్చిపోగలవేమో కానీ నేను మర్చిపోలేను’ అని సాయి పల్లవి హీరోతో అంటోంది.  

ఎ. ఎల్ విజయ్ దర్శకుడు కాగా, సాయిపల్లవ సరసన నాగశౌర్య‌ హీరోగా నటించాడు. రజనీకాంత్ తో ‘2.0’ సినిమా తీస్తున్న నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీన్ని నిర్మిస్తున్నారు. సాయిపల్లవి ప్రస్తుతం నాని సరసన ఎంసీఏ సినిమాలో నటిస్తోంది. ఇంకో రెండు మూడు సినిమాలు కూడా అమ్మడి చేతుల్లో ఉన్నాయి.