బ్రాహ్మణులే అసలైన క్రైస్తవులు - MicTv.in - Telugu News
mictv telugu

బ్రాహ్మణులే అసలైన క్రైస్తవులు

November 18, 2017

తన పుస్తకం ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకం’కు వ్యతిరేకంగా సంపాదకుడు ఎంవీఆర్ శాస్త్రి రాసిన ‘ఐలయ్య’ పైత్యం’ పుస్తకంపై ఐలయ్య ఘాటుగా స్పందించారు. శాస్త్రికి ఈ దేశ కష్టజీవుల గురించి తెలియదని, ఆయన అగ్రవర్ణాల గురించే రాశారని విమర్శించారు. అన్ని సంపాదకీయాలు రాసిన శాస్త్రి.. కుమ్మర్లు, గొల్లలు, రైతులు వంటి ఉత్పత్తి కులాల గురించి ఎక్కడైనా రాశాడా అని ప్రశ్నించారు. తాను క్రైస్తవమతాన్ని ప్రచారం చేస్తున్నట్లు శాస్త్రి ఆరోపణలపై స్పందిస్తూ.. బ్రాహ్మణులే అసలైన క్రైస్తవులు అని ఎద్దేవా చేశారు.

శాస్త్రి, శర్మల పిల్లలు ఇంగ్లిష్ భాష చదువుకున్నారు. ఇంగ్లిష్ క్రైస్తవ భాష కనుక వాళ్లందరూ క్రైస్తవులే. బ్రాహ్మణుల పిల్లలు క్రైస్తవ మిషనరీల్లో చదువుకున్నారు.వాళ్లకు సంస్కృతంపై అంత ప్రేమ ఉంటే క్రైస్తవ భాష అయిన ఇంగ్లిష్ ఎందుకు చదువుకున్నారు?’ అని అన్నారు.

తన పేరును ఐలయ్య షెపర్డ్ బదులు ఐలయ్య పాస్టర్‌గా మార్చుకోవాలన్న ఉచిత సలహాపై స్పందిస్తూ.. క్రైస్తవ స్కూళ్లలో చదువుకున్న అద్వానీ, అరుణ్ జైట్లీ, అరుణ్ శౌరీలు కూడా వాళ్ల పేర్ల వెనుక బిషప్ అని పెట్టుకోవాలన్నారు. తాను షెపర్డ్ అని పేరు పెట్టుకున్నాక ప్రపంచమంతా తన పేరు తెలుసిందని, శర్మ, శాస్త్రి పేర్లు పెట్టుకున్నవాళ్లంతా లోకల్ గానే మిగిలిపోయారని సటైర్ వేశారు.