ఐలయ్య బయటికొస్తే అరెస్ట్ చేస్తాం - MicTv.in - Telugu News
mictv telugu

ఐలయ్య బయటికొస్తే అరెస్ట్ చేస్తాం

October 27, 2017

‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకంతో దుమారం రేపిన ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఇంటిముందు శుక్రవారం సాయంత్రం నుంచి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విజయవాడలో శనివారం ఐలయ్య సత్కార సభకు అక్కడి పోలీసులు అనుమతి నిరాకరించడం తెలిసిందే.

అయితే తాను స్నేహితులకు కలసి కచ్చితంగా విజయవాడకు వెళ్లి తీరతానని ఆయన హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తార్నాకలోని ఐల‌య్య ఇంటి వ‌ద్ద ఏపీ, తెలంగాణ పోలీసులు మోహ‌రించారు. ఆయన ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే అరెస్టు చేస్తామ‌ని హెచ్చరించారు. పోలీసుల ధోరణి అప్రజాస్వామికమని ఐలయ్య మండిపడ్డారు. తనను అడ్డుకుంటే టీ మాస్ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌కు దిగుతామ‌ని హెచ్చ‌రించారు. మరోపక్క..  ఐలయ్యకు ఏపీ పోలీసుల నుంచి నోటీసులందాయి. ఆయన ఐలయ్య ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులిచ్చారు. సభకు రావాలని యత్నిస్తే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు తెలిపారు. విజయవాడలోని కంచ ఐలయ్య సంఘీభావం సభకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.